మనయొక్క ఇతరుల యొక్క పనులు, నిర్ణయాలు, మంచివి లేదాచెడ్డవని పేరుపెట్టడం చుట్టూ మన జీవితాలు అల్లుకుంటాయి. "సమత్వ బుద్ధియుక్తుడైనవాడు పుణ్యపాపములను రెండింటిని ఈ లోకమునందేత్యజించును” అని శ్రీకృష్ణుడు చెప్పారు (2.50). అంటే ఒకసారి మనమీ సమత్వ యోగాన్ని చేరుకున్న తర్వాత ఇలా పేర్లు పెట్టడంవదిలేస్తాము; అభిప్రాయాలకు తావు ఇవ్వము.

మనమనస్సు అనేక రంగుటద్దాలతో కప్పబడి ఉంటుంది. ఎదిగే సమయంలో మన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల నియంత్రణ ద్వారా అలాగేమనముంటున్న దేశం యొక్క చట్టం ద్వారా మనలో ఇవన్నీ ముద్రించబడతాయి. మనము ఈరంగుటద్దాల ద్వారానే విషయాలు/పనులను చూస్తూ ఉంటాము; వాటినిమంచి లేదా చెడుగా ముద్ర వేస్తాము. యోగం ఈ రంగులన్నీ స్వయంగా కరిగిపోయి అన్నివిషయాలను స్పష్టంగా చూడగలిగేలా చేస్తుంది. ఇది రెమ్మలకు బదులుగా మూలాలను నాశనంచేయడం; మన స్వంత రంగును జోడించడానికి ప్రయత్నించకుండాపరిస్థితులను ఉన్నవి ఉన్నట్లుగా అంగీకరించడం వంటిది.

జీవితంలోఈ రంగుటద్దాలు మనల్ని ముడుచుకుపోయేటట్లు చేస్తాయి. తద్వారా నిర్ణయాలుతీసుకోవడానికి అవసరమైన కీలకమైన సమాచారాన్ని కోల్పోతాము. సరిపోని లేదా తప్పుగాఅన్వయించబడిన సమాచారంతో తీసుకున్న నిర్ణయాలు, పనులు అనివార్యంగావిఫలమవుతాయి.

తటస్థంగాఉండడం అంటే ఒక విద్యార్థి ఒక సమస్యకు అనుకూలంగా మరియు వ్యతిరేకంగా ఏకకాలంలోవాదించాల్సిన చర్చ లాంటిది. ఇది చట్టం లో చెప్పినట్లు, మనం నిర్ణయాలు తీసుకునే ముందు రెండు పక్షాల వారి మాటలూ వినడం లాంటిది. ఇదిఅన్ని జీవులలో తనను, అన్ని జీవులను తనలోనూ చూడడం వంటిది.అంతిమంగా సర్వత్ర కృష్ణమయమే (6.29). ,

పరిస్థితిలోమనం కూరుకుపోకుండా మనల్ని మనం వేరు చేసుకుని, పరిస్థితి యొక్కరెండువైపులను అర్థం చేసుకునే సామర్థ్యం ఇది. ఈ సామర్ద్యం వికసించాక “దారుమ” బొమ్మలాగా మధ్యలో మనల్ని మనంకేంద్రీకరించుకోవడం మొదలు పెడతాం.

ఎవరైనాక్షణికమైన యోగ స్థితిని (సమతుల్యత) పొందినప్పుడు కూడా, ఆ సమయంలో వారి ద్వారా చేయబడేపని సమంజసంగా ఉంటుంది. ఆధ్యాత్మికతను గణాంకకోణంలో చూస్తే ఇది ఒక వ్యక్తి సమతుల్యతలో ఉన్న సమయం యొక్క శాతమే. ఈ యాత్ర దానినివంద శాతానికి పెంచడానికే!