భూమిపై జీవానికి నీరు చాలా అవసరం. నిస్వార్థ చర్యలను వివరించడానికి శ్రీకృష్ణుడు వర్షాన్ని ఉదాహరణగా ఉపయోగిస్తారు (3.14). వేడి కారణంగా నీరు ఆవిరైపోయి మేఘాలు ఏర్పడతాయి. సరైన పరిస్థితుల్లో అది వర్షంగా తిరిగి వస్తుంది. దీని అర్థం ఏంటంటే వర్షం అనేది చక్రంలోని ఒక భాగం.

ఈ ప్రక్రియలోని నిస్వార్ధ కర్మలను, శ్రీకృష్ణుడు 'యజ్ఞం' అని అంటారు. మహాసముద్రాలు నీటిని ఆవిరి చేసి మేఘాలు ఏర్పడడానికి హాయపడతాయి; మేఘాలు వర్షంగా మారడానికి తమను తాము త్యాగం చేస్తాయి. ఈ రెండూ యజ్ఞరూపమైన నిస్వార్ధ కర్మలు.

యజ్ఞం రూపమైన నిస్వార్ధ కర్మలు అస్థిత్వము యొక్క అత్యున్నత శక్తిని కలిగి ఉంటాయని (3.15) శ్రీకృష్ణుడు సూచించారు. ప్రారంభంలో ఈ శక్తిని ఉపయోగించి సృష్టికర్త సృష్టిని చేసారు (3. 10), ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగించి పరమ శ్రేయస్సును పొందమని ఆయన సలహా ఇచ్చారు (3.11). ఇది యజ్ఞ రూపమైన నిస్వార్ధ కర్మ ద్వారా అస్థిత్వముతో మనల్ని మనం సంలీనము చేసుకుని, దాని శక్తిని ఉపయోగించు కోవడమే.

వర్షం యొక్క ఈ పరస్పర అనుసంధాన ప్రక్రియలో మేఘాలు గర్వపడి నీటిని నిల్వ చేసుకుంటే చక్రం భంగపడుతుంది. ఈ చక్రాలకు భంగం కలిగిస్తూ ఈ విధంగా జమ చేసేవారిని శ్రీకృష్ణుడు దొంగలు అని పిలుస్తారు (3.12). మరోవైపు, వర్షం యొక్క నిస్వార్ధ కర్మ కొనసాగినప్పుడు మేఘాలు మరలా మరలా ఏర్పడుతూ ఉంటాయి. శ్రీకృష్ణుడు, ఈ చక్రంలో ఒకరికొకరు సహాయం చేసుకునే వారి కోసం 'దేవత' అనే పదాన్ని ఉపయోగిస్తారు (3.11).

ఈ నిస్వార్ధ కర్మలు, సముద్రం వర్షం ద్వారా నీటిని తిరిగి పొందినట్లుగా, ఎన్నింటినో తిరిగి ఇస్తాయి. కాబట్టి జమచేసుకోకుండా ఈ చక్రంలో పాల్గొనండి; ఇది అన్ని పాపాల నుండి మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుంది. జమచేసుకోవడమే అనేదే అసలు పాపం అని శ్రీకృష్ణుడు చెబుతున్నారు (3.13).

“స్వార్ధ కర్మలు మనలను కర్మబంధనంలో బంధిస్తాయని” శ్రీకృష్ణుడు హెచ్చరించారు (3.9). యజ్ఞంలా అనుబంధం లేకుండా కర్మలను నిర్వహించమని సలహా ఇస్తున్నారు.

ఈ భౌతిక ప్రపంచంలో ఒకరిపై ఒకరు ఆధారపడటం తప్ప మరో మార్గం లేదు. ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒకజీవి ఒక చక్రంలో లేదా మరొకదానిలో భాగం; ఏదో వస్తువుపై లేదా మరొకరిపై ఆధారపడి ఉంటుంది. మనలో ఒక భాగం ఇతరులలో, ఇతరులలోని కొంత భాగం మనలో ఉందనే అవగాహన కీలకం.