మొక్కై వంగనిది మానై ఒంగునా అని ఒక సామెత ఉంది. చెడు అలవాట్లను చిన్నతనంలోనే గుర్తించి తల్లిదండ్రులు మరియు గురువులు వాటిని మానిపించి పిల్లలను మంచిమార్గంలో పెట్టగలగాలి, ఎందుకంటే ఆలస్యం చేసిన కొద్దీ వాటిని మానిపించటం చాలా కష్టము.

అలాగే చిన్నతనం లోనే మంచి అలవాట్లు నేర్చుకోవాలి. అప్పుడు అవి పిల్లల మనసులో బలంగా నాటుకుపోయి ముందు ముందుగా వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అలా  నేర్చుకున్న మంచి విలువలు ఎప్పుడూ   మనతో ఉంటాయి.

మంచి అలవాట్లు , మరియు విలువలను నేర్చుకుని పాటిద్దాం, మనము ఉన్న ఊరికి, మన దేశానికి మంచి చేద్దాం!