చందమామ రామాయణం: Recent Episodes

Kadachepta.com

ఎన్ని సార్లు విన్నా తనివి తీరనివి మన రామాయణం, మహాభారత ఇతిహాసములు. ఎందరో మహానుభావులు వీటిని వాడుక భాషలో అనువదించి, ప్రవచనాలుగా, కదిలే బొమ్మలుగా, సినిమాలుగా తీసి మనల్ని జ్ఞానులని చేస్తున్నారు. చాలా కాలంగా మేము వాడుక భాషలో, వివరం కోల్పోకుండా, పిల్లలకు అర్థమయ్యేలా ఉండే రామాయణం కోసం వెతుకగా మాకు ఈ చందమామ రామాయణం తారసపడింది. ఇంకేం! మా ఆనందానికి ఫలితంగా ఈ శ్రవణ సంపుటి రూపంలో మీ ముందుకు తీసుకువచ్చాము.

View Details

లవకుశలు రామ కీర్తన చేస్తున్నారు. రాముడు వారు సీత కొడుకులని గుర్తించాడు. వాల్మీకి మహర్షికి సీతను తన పవిత్రత నిరూపించుకోమని, అయోధ్యకు పిలిపించాడు. సీత తానూ కల్మషం లేనిదైతే భూమాత వచ్చి తనను తీస్కెళ్లిపోతుందని కోరింది. వెంటనే భూమాత సీత దేవిని తీస్కువెళ్లిపోయింది. లక్ష్మణ, భరత, శత్రుజ్ఞులు తమ తమ పిల్లలకు రాజ్యభారాలు అప్పగించేశారు. రాముడు రాజ్యాన్ని లవకుశలకు అప్పగించి అవతారం చాలించారు. సర్వేజనా సుఖినోభవంతు!

The post రామాయణం ఉత్తరకాండ – సమాప్తం first appeared on Telugu Audibles📖.

View Details

రాముడు అశ్వమేధ యాగం చేయతలిచాడు. అశ్వ మీద యాగ ఫలితములు చర్చించుకుంటూ ఇలుడు స్త్రీగా మారుట, అశ్వమేధ యాగం చేసి తిరిగి పురుషుడిగా మారుట వంటి విశేషములు చర్చించుకుని వనరులను, రాక్షసులను పిలిచి అశ్వమేధ యాగం చేశారు.

The post రామాయణం ఉత్తరకాండ – 12 first appeared on Telugu Audibles📖.

View Details

శత్రుజ్ఞుడు అద్భుతమైన యుద్ధం చేసి లావానుడిని చంపేశాడు. కొన్ని రోజులకు ఒక బ్రాహ్మణుడు అకాల మరణం చెందిన తన పుతృడిని రాముడు వద్దకు తీసుకువచ్చిన సారాను వేడాడు. అకాల మరణాలు ఊరికే రావని దేశంలో ఏదయినా యుగధర్మానికి విరుద్దమయిన పని ఏదైనా జరిగితే ఆలా జరుగుతుందని వసిష్ఠ మహాముని సెలవిచ్చారు. అది ఏమిటో దానితో పాటు మరిన్ని సూక్ష్మ కథలు వినండి.

The post రామాయణం ఉత్తరకాండ – 11 first appeared on Telugu Audibles📖.

View Details

రాముడు కొలువుదీరి ఉండగా పలు రకాల సమస్యలను పరిష్కరించాడు. ఒకనాడు కొలువుకు నూరుకు పైగా మునులు వచ్చి లవణాసురుడనే రాక్షసుడు తమను బాధపెడుతున్నారని, వాడి బాధనించి విముక్తి కలిగించమని రాముడిని కోరారు. రాముడు శత్రుజ్ఞుడికి యుద్ధ ప్రణాళిక వివరించి యుద్దానికి పంపాడు.

The post రామాయణం ఉత్తరకాండ – 10 first appeared on Telugu Audibles📖.

View Details

వాల్మీకి మహర్షి సీతను ఆదరించి ఋషి కన్యలతో కలిసి ఉండమని సెలవిచ్చాడు. రాముడు వియోగంలో మునిగిపోయాడు. సీత రాములకు ఎందుకీ వియోగం అని లక్ష్మణుడు సుమంత్రుడితో అనగా, సుమంత్రుడు భృగుమహర్షి శాపం గురించి చెప్పాడు. రాముడు వియోగంతో బాధపడుతూ ప్రజల సమస్యలను పట్టించుకోలేదని చింతిస్తూ లక్ష్మణుడితో అది చాలా తప్పు అని, ఉదాహరణకు కొన్ని కథలు చెప్పాడు.

The post రామాయణం ఉత్తరకాండ – 9 first appeared on Telugu Audibles📖.

View Details

అగస్త్యుడు రామునికి వాలి సుగ్రీవుల పుట్టు పూర్వోత్తరాలు చెప్పాడు. సీత గర్భవతి అయింది, రాముడు కోరిక ఎమన్నా కోరామని అడుగగా, సీత ఋషుల ఆశ్రమాలు చూడాలని ఉంది అనగా రాముడు సరే అన్నాడు. ఈలోగా పురప్రజలు చేసే అపవాదులు విన్నాడు. ఆ అపవాదు ఇక్ష్వాకు వంశానికి చేటు అని గ్రహించి సీతను అడవులలో వదిలేసి రమ్మని ఆదేశించాడు.

The post రామాయణం ఉత్తరకాండ – 8 first appeared on Telugu Audibles📖.

View Details

కార్తవీర్యార్జునిడి చేతిలో ఓడిన రావణుడికి ఇంకా మదం అణగలేదు. ప్రపంచమంతా తిరుగుతూ కనిపించిన వీరులందరితో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఒకనాడు కిష్కిందకు వెళ్లి వాలిని సవాలు చేసాడు. వాలి రావణుడిని చంకనపెట్టుకుని నాలుగు దిక్కులా సముద్రాలలో ముంచి లేపాడు. రావణుడు వాలికి క్షమాపణ చెప్పుకుని అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నాడు. రాముడు హనుమను తలుస్తూ అంతటి మహాబలవంతుడు సుగ్రీవుడికి ఎందుకు సాయం చేయలేకపోయాడని అగస్త్యుడిని అడుగగా, హనుమ అద్భుతశక్తి గురించి ఇలా చెప్పసాగాడు…

The post రామాయణం ఉత్తరకాండ – 7 first appeared on Telugu Audibles📖.

View Details

రావణుడి ఆగడాలకు హద్దు లేదు. ముల్లోకాలూ తిరుగుతూ యుద్ధం అందరితోనూ యుద్ధం చేసి గెలిచాడు. మార్గమున కనిపించిన అందగత్తెలు చెరపడుతూ అల్లకల్లోలం చేస్తున్నాడు. ఒకనాడు రంభ తారసపడితే బలవంతంగా చెరపట్టాడు, అది విని నలకూబరుడు “తనను కోరని స్త్రీని బలాత్కరిస్తే రావణుడికి తలా వెయ్యి చెక్కలవుతుంది” అని శపించాడు. రావణుడి విజయ పరంపరను కార్తవీర్యార్జునుడు అనే వీరుడు నిలదీసాడు.

The post రామాయణం ఉత్తరకాండ – 6 first appeared on Telugu Audibles📖.

View Details

చావును శాసించే యముడికి చావుంటుందా? రావణుడు యముడిని చంపుతా అని యమలోకానికి వెళ్తున్నపుడు నారదుడు ఆతృతగా యుద్ధం చూడటానికి వెళ్ళాడు. యముడికి రావణునిదికి దారుణ యుద్ధం జరిగింది. ముల్లోకాలూ తల్లకిందులయ్యాయి.

The post రామాయణం ఉత్తరకాండ – 5 first appeared on Telugu Audibles📖.

View Details

రావణుడికి కుబేరుడికి భయంకర యుద్ధం జరిగింది.రావణుడు మాయ యుద్ధం చేసి కుబేరుడిని ఓడించి పుష్పక విమానంలో శరవనానికి వెళ్తుండగా మార్గ మద్యంలో శివలోకం వచ్చింది. నంది రావణుడిని ఆపగా రావణుడు శివలోకాన్నే పెకలిస్తా అని కొండని ఎత్తపోయాడు. .

The post రామాయణం ఉత్తరకాండ – 4 first appeared on Telugu Audibles📖.

View Details

రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మ నించి వరాలు పొందిన సంగతి పాతాళంలో ఉన్న సుమాలికి తెలిసింది. వెంటనే రాక్షసులను వెంటబెట్టుకుని రావణ వద్దకు వచ్చారు. రావణుడికి లంకను తిరిగి సంపాదించామని నూరిపోశారు.

The post రామాయణం ఉత్తరకాండ – 3 first appeared on Telugu Audibles📖.

View Details

సుకేశుడి పుత్రులయిన మాల్యవంతుడు, మాలీ, సుమాలి లంకలో నివాసం ఏర్పరచుకుని వార గర్వంతో ముల్లోకాలనూ క్షోభపెట్టసాగారు. దేవతలందరూ విష్ణుమూర్తి వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా, విష్ణువు వారిని సంహరిస్తా అని అభయమిచ్చాడు.

The post రామాయణం ఉత్తరకాండ – 2 first appeared on Telugu Audibles📖.

View Details

రాముని పట్టాభిషేకం అయ్యి రాజ్య పాలన చేస్తుండగా అగస్త్య మహాముని అయోధ్య వచ్చారు. మునులందరూ ఇంద్రజిత్తుని లక్ష్మణుడితో సంహరించిన వైనం తమకు ఆశ్చర్యం కలిగించిందని అనేసరికి రాముడికి ఆశ్చర్యం కలిగి ఇంద్రజిత్తుని వృత్తాంతం చెప్పమని కోరాడు. దానికి అగస్త్యుడు ఇలా చెప్పసాగాడు.

The post రామాయణం ఉత్తరకాండ – 1 first appeared on Telugu Audibles📖.

View Details

విభీషణుడు పుష్పక విమానంలో సీతారామ, లక్ష్మణులను అయోధ్య కు తీసుకువెళ్లబోతూ సీత కోరిక మేరకు మార్గమధ్యంలో కిష్కిందలో ఆగి సుగ్రీవుడి భార్యలను, ఇతర వానరప్రముఖులను అయోధ్యకు తీసుకువెళ్లారు. భరతుడు ఎంతో మర్యాదతో, వైభవంగా రాముని పట్టాభిషేకం చేశారు. రామరాజ్యం ఏర్పడింది. యుద్ధకాండ సమాప్తం

The post రామాయణం యుద్ధకాండ సమాప్తం first appeared on Telugu Audibles📖.

View Details

విభీషణ అనుమతి తీస్కుని లంకకి వెళ్లి, రావణ సంహారం చేసానని సీతకి చెప్పమని రాముడు హనుమకు చెప్పాడు. సీతను రాముడి వద్దకు చక్కగా అలంకరించి తీసుకువచ్చారు. పరాయి వాడి దగ్గర అంత కాలం ఉన్న సీతను స్వీకరించను అన్నాడు. సీత అగ్ని ప్రవేశం చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది. ఇంకా అంత శుభమే!

The post రామాయణం యుద్ధకాండ – 13 first appeared on Telugu Audibles📖.

View Details

లక్ష్మణుడు కొనప్రాణంతో ఉండగా, హనుమంతుడిని ఔషధీ పర్వతంపై ఉన్న ఔషదములు దొరక్క ఏకంగా పర్వతాన్నే పెకలించి యుద్ధరంగానికి తీసుకువచ్చాడు. ఆ ఔషదములకు లక్ష్మణుడికి ప్రాణం వచ్చింది. రెట్టించిన ఉత్సాహంతో రాముడు యుద్ధం ప్రారంభించాడు. అలా ఏడూ రాత్రులూ ఏడూ పగళ్ళూ యుద్ధం చేశారు. రాముడు దేవతలిచిన దివ్యమైన బాణాన్ని సాధించగా అది దుష్ట రావణుడి ప్రాణాలు హరించింది.

The post రామాయణం యుద్ధకాండ – 12 first appeared on Telugu Audibles📖.

View Details

నికుంభుల హోమం చేస్తున్న ఇంద్రజిత్తును ఎవరైతే అడ్డగిస్తారో, వారి చేతిలోనే ఇంద్రజిత్తుకి చావు ఉందన్న విషయం విభీషణుడు రాముడుతో చెప్పాడు. దాంతో రాముడు, లక్షమునిడిని వెళ్ళమని అన్నాడు. లక్ష్మణుడికి, ఇంద్రజిత్తుకు, వనరులకు, రాక్షసులకు భయంకరమయిన యుద్ధం జరుగగా లక్ష్మణుడు ఒక తీవ్రమయిన బాణంతో ఇంద్రజిత్తును సంహరిస్తాడు.

The post రామాయణం యుద్ధకాండ – 11 first appeared on Telugu Audibles📖.

View Details

కుంభకర్ణుడు, అకంపనుడు, అతికాయుడు, మకరాక్షుడు తదితర రాక్షసులందరూ చచ్చారు. ఇంద్రజిత్ రామ లక్ష్మణులను అంతమొందిస్తానని రావణుడికి ప్రమాణం చేసి భీకర యుద్ధం చేయనారంభించాడు.

The post రామాయణం యుద్ధకాండ – 10 first appeared on Telugu Audibles📖.

View Details

సుగ్రీవుడు మూర్ఛనించి లేచి కుంభకర్ణుడి చెవులు చెక్కిళ్ళు కొరికేసి ఒక్క గెంతులో రాముడు వద్దకు ఎగిరాడు. కుంభకర్ణుడు రగిలిపోయి రామదండు మీదకు దండెత్తాడు. దొరికిన వారిని దొరికినట్టు తినేస్తున్నాడు.

The post రామాయణం యుద్ధకాండ – 9 first appeared on Telugu Audibles📖.

View Details

కుంభకర్ణుడు అతి భయంకరంగా యుద్ధం చేయనారంభించాడు. వానర ప్రముఖులను చిత్తుగా ఓడించాడు. హనుమంతుడు వంటి పరాక్రమవంతులు కూడా కుంభకర్ణుడి శక్తికి పడిపోయారు. కుంభకర్ణుడు సుగ్రీవుడిని మూర్ఛపుచ్చి లంకకు తీసుకువెళ్లాడు.

The post రామాయణం యుద్ధకాండ – 8 first appeared on Telugu Audibles📖.

View Details

రావణ సైన్యంలో ఎందరో ప్రముఖ రాక్షషులు చచ్చారు. రావణుడికి ఏమి చెయ్యాలో పాలు పోక కుంభకర్ణుడిని నిద్రలేపమని ఆదేశించాడు. లంకాసేన కొండంత తినుబండారాలు, ఏనుగులు, గుర్రాలు వెంటబెట్టుకుని భేరీలు మోగిస్తూ కుంభకర్ణుడిని నిద్ర లేపడానికి ప్రయత్నిస్తున్నారు

The post రామాయణం యుద్ధకాండ – 7 first appeared on Telugu Audibles📖.

View Details

భీకర యుద్ధం ఆరంభమయింది. ఇంద్రజిత్తును యుద్ధరంగంలో అంగదుడితో తలపడి తరువాత మాయాయుద్ధం మొదలుపెట్టాడు. రామ లక్ష్మణుల మీదకు నాగాస్త్రం విడిచి వారిని కట్టి పడేసి సందులేకుండా బాణాలతో కొట్టాడు.. రామలక్ష్మణులు చనిపోయారని భావించి తిరిగి వెళ్ళాడు. వానర సేన శోకసముద్రంలో మునిగిపోయింది.

The post రామాయణం యుద్ధకాండ – 6 first appeared on Telugu Audibles📖.

View Details

రావణుడు అతని మంత్రివర్గంలో కొంత మంది తన శ్రేయస్సు కోరి సీతను తిరిగి ఇచ్చెయ్యమన్నారు. రావణుడు ససేమిరా అని యుద్దానికి సిద్ధం అయ్యాడు. రాముడు శిబిరం యుద్ధ ప్రణాళిక చేసుకున్నారు.

The post రామాయణం యుద్ధకాండ – 5 first appeared on Telugu Audibles📖.

View Details

రాముడి ఆజ్ఞ ప్రకారం, నలుడు ప్రణాళిక ప్రకారం వానరులు సేతువు నిర్మించారు. వానర సేన వారధి దాటి లంకకు చేరారు. రావణుడి శిబిరం గుబులుతో ఉండగా, రావణుడు వేగులను పంపిస్తూనే ఉన్నాడు విభీషణుడు వారిని గుర్తించి పట్టిస్తూనే ఉన్నాడు.

The post రామాయణం యుద్ధకాండ – 4 first appeared on Telugu Audibles📖.

View Details

రాముడు విభీషణుడిని నమ్మి తన సేనలో చేర్చుకున్నాడు. రావణుడు శకుడనే రాక్షసుడిని వేగులాగా వెళ్లి వానర సేన బలమెంతో తెలుసుకుని రమ్మన్నాడు. శకుడు పక్షిలాగా పైన ఎగురుతుంటే వానరులు కనిపెట్టి కిందికి లాగేసారు… ఇంకా ఏమి జరిగిందో వినండి.

The post రామాయణం యుద్ధకాండ – 3 first appeared on Telugu Audibles📖.

View Details

రవాణా సభలో విభీషణుడు నీటి బోధ చేయడానికి ప్రయత్నం చేసాడు, సీతని రామునికి మర్యాదగా అప్పచెప్పమని అన్నాడు. కానీ రావణుడికి ఆ మాటలు పడలేదు. తనకు నచ్చిన విధంగా మాట్లాడిన మంత్రుల మాట మాత్రమే విన్నాడు. విభీషణుడిని నన మాటలు అని అవమానించాడు. విభీషణుడు కొంత మంది మంచి రాక్షషులతో రాముని చేరడానికి వెళ్లారు. రాముడి అతన్ని చేరదీసాడు..

The post రామాయణం యుద్ధకాండ – 2 first appeared on Telugu Audibles📖.

View Details

రాముడు హనుమంతుడు లంక గురించి చెప్పినదంత విని ఎంతో సంతోషించాడు. సముద్రాన్ని ఎలా అయినా దాటి లంక చేరి రావణాది రాక్షసులను హతమార్చేందుకు యుద్ధ ప్రణాళిక చేయమని సుగ్రీవుడితో అన్నాడు. మరోపక్క రావణాసురుడు తన మంత్రి వర్గంతో జరిగిన దారుణానికి విచారిస్తూ, బదులు యుద్దానికి సన్నాహమవుతున్నారు! యుద్ధకాండ మొదలు…

The post రామాయణం యుద్ధకాండ మొదలు first appeared on Telugu Audibles📖.

View Details

లంకను తగలబెట్టిన హనుమ సీతామాత వద్ద సెలవు తీసుకుని లంక నించి మహేంద్రగిరివైపుకు ఎగిరాడు. సింహనాదంతో మహేంద్రగిరి దగ్గర దిగి అంగదాది వానరులకు జరిగినదంతా వివరంగా చెప్పి కిష్కింధకు బయలుదేరారు. రాముడికి జరిగినదంతా వివరించి, సీతాదేవి సైన్యాన్ని వెంటబెట్టుకుని రావణవధ చేయమని కోరిందని అన్నాడు.

The post రామాయణం సుందరకాండ సమాప్తం first appeared on Telugu Audibles📖.

View Details

రావణుడు ఇంద్రజిత్తుని పంపగా, ఘోరమయిన యుద్ధం జరిగింది. ఇంద్రజిత్తు చివరకు బ్రహ్మాస్త్రం వదలగా, హనుమంతుడు రాష్ట్రానికి గౌరవం ఇచ్చి లొంగిపోతాడు. రావణుడు హనుమను చంపజాలగా విభీషణుడు వారించి, కేవలం దండించి పంపమని సూచన ఇచ్చాడు. “చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు” అన్న సామెత హనుమంతుడికి సొంతం!

The post రామాయణం సుందరకాండ – 6 first appeared on Telugu Audibles📖.

View Details

సీత ఇచ్చిన చూడామణిని చేతి ఉంగరాన్ని ధరించి, రావణుడి పని పడదామని లంక విధ్వంసం మొదలుపెట్టాడు. జంబుమాలి, అక్ష కుమారుడు వంటి పరాక్రమవంతులయిన రాక్షషులను హతమార్చి లంకను దాదాపుగా ధ్వంసం చేసాడు

The post రామాయణం సుందరకాండ – 5 first appeared on Telugu Audibles📖.

View Details

హనుమంతుడు ఒక్కసారిగా సీత దగ్గరకి వెళ్తే బయపడుతుందనుకుని శింశుపా వృక్షం పైనే కూర్చుని రామకథ అంతా చెప్పాడు. సీతకు రాముడిచ్చిన ముద్రికను చూపగా సీత అతన్ని నమ్మింది. రాముడు సీత కోసం ఎంతో వియోగం చెందాడని చెప్పాడు. సీత తన జ్ఞాపకంగా ఒక సన్నివేశం వివరించింది.

The post రామాయణం సుందరకాండ – 4 first appeared on Telugu Audibles📖.

View Details

హనుమంతుడు అశోక వనంలో సీతను చూసి ఎంతో సంబరపడ్డాడు. కానీ దయనీయస్థితిలో ఉన్న సీతను చూసి ఎంతో బాధపడ్డాడు. రావణుడు తనకు లొంగమని వేదిస్తుండటం, రాక్షషులు తనని చంపుతా అని బెదిరించడం లాంటి సన్నివేశాలన్నీ చూసి హనుమంతుడి గుండె నీరయింది…

The post రామాయణం సుందరకాండ – 3 first appeared on Telugu Audibles📖.

View Details

హనుమంతుడు రాత్రి వేళ సూక్ష్మ రూపము ధరించి లంక ప్రవేశించాడు. లంక మారుతిని ఆపగా మారుతి ఒక్క పోటుతో లంకను నెల కూల్చాడు. తరువాత లంకంతా గాలించి చివరికి అశోక వనం చేరాడు

The post రామాయణం సుందరకాండ – 2 first appeared on Telugu Audibles📖.

View Details

హనుమంతుడు మాహేంద్రగిరిపైనుండి ఎగిరి లంకకు బయలుదేరాడు. మార్గ మధ్యమున మైనాకుడు సేదతీరమని ఆహ్వానించగా అది ఒక విజ్ఞమని తలచి, మరల వచ్చేప్పుడు సేద తీరుతానని చెప్పి ముందుకు వెడలెను. మార్గ మధ్యమున సురసను పెట్టిన పరీక్ష, సింహిక రాక్షసిని వధ చేసి సురక్షితముగా లంక చేరెను.

The post రామాయణం సుందరకాండ – 1 first appeared on Telugu Audibles📖.

View Details

సంపాతి అలా వానరులకు సాయం చేయగానే నిసకారమహర్షి చెప్పిన విధంగా అతనికి రెక్కలు మొలిచాయి. జాంబవతాదులకు కూడా విజయం కలుగుతుందని చెప్పాడు. కానీ వనరులకు లంకకు మధ్య ఉన్న అంతులేని సముద్రం చూసి దిగులు చెందారు. అందరూ హనుమను ప్రేరేపించగా మహేంద్రగిరిపై నించి లంక వైపు దూకడానికి సిద్దమవ్వగా ఈ కిష్కిందకాండ ముగిసింది.

The post రామాయణం కిష్కిందకాండ సమాప్తం first appeared on Telugu Audibles📖.

View Details

అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు వింధ్య పర్వతం పైన సీత దొరకలేదని విచారంతో, గడువు దాటిపోయిందని భయంతో ప్రాయోపవేశం చేసుకుందామని సిద్ధపడ్డారు. ఇంతలో సంపాతి అనే ఒక మహాపక్షి వారి కంట పడింది. సంపాతి జటాయు అన్న అని తెలుసుకుని జరిగినదంతా చెప్పగా, సంపాతి సీతని ఎవరు ఎత్తికెళ్లింది దివ్య దృష్టితో చూసి చెప్పేసాడు.

The post రామాయణం కిష్కిందకాండ – 6 first appeared on Telugu Audibles📖.

View Details

సుగ్రీవుడు వనరులందరికి పదిహేను రోజుల్లో కిష్కిందకి రావాలని ఆదేశాన్ని ఇచ్చాడు. లక్షల కోట్ల సంఖ్యలో రకరకాల వానరులు కిష్కింధకు చేరాయి. సుగ్రీవుడు నలుదిక్కుల వారిని పంపి సీతాకోసం వెతకమన్నాడు. తూర్పు, పడమర, ఉత్తర దిక్కులు వెళ్లిన వానరులంతా సీత దొరకలేదని తిరిగివచ్చారు. అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు మొదలగు వానర ప్రముఖులు దక్షిణం వైపు వెళ్లారు. 6 నెలలు గడిచినా కానీ వారికి సీత జాడ తెలియలేదు.

The post రామాయణం కిష్కిందకాండ – 5 first appeared on Telugu Audibles📖.

View Details

వాలిని హతమార్చాక, సుగ్రీవుడు కిష్కిందకి రాజయ్యాడు. రాముడు పరిసరాలకు దగ్గర్లో ఉన్న ప్రసరణ పర్వతం మీద గుహలో బస చేశారు. సుగ్రీవుడు భోగలాలసుడై రామునికి సాయం చేయడం మరిచాడు. రాముడు లక్ష్మణుడిని కిష్కిందకి వెళ్లి సుగ్రీవుడికి గుర్తు చెయ్యమన్నాడు…

The post రామాయణం కిష్కిందకాండ – 4 first appeared on Telugu Audibles📖.

View Details

సుగ్రీవుడు చావుదెబ్బలు తిని వాలిని సంహరించలేదని రాముడి మీద ఆగ్రహించాడు. వాలి సుగ్రీవులు ఒకేలా ఉండడంచేత ఏమీ చేయలేకపోయానని చెప్పి, ఒక గజపుష్పి లతను ధరించి యుద్దానికి వెళ్ళమన్నాడు.

The post రామాయణం కిష్కిందకాండ – 3 first appeared on Telugu Audibles📖.

View Details

రామలక్ష్మణులు ఋష్యముఖ పర్వత పరిసరాలలోకి వచ్చినట్టు సుగ్రీవుడు చూసి వాలి పంపిన వారేమోనని బయపడి హనుమంతుడిని వారెవరో తెలుసుకోమని పంపాడు. హనుమంతుడు వారు రామలక్ష్మణులని, సాయం కోర వచ్చారని, మిత్రులు కావాల్సింది సుగ్రీవునకు సూచించాడు.

The post రామాయణం కిష్కిందకాండ – 1 first appeared on Telugu Audibles📖.

View Details

రామలక్ష్మణులు సీతను వెతుకుతూ వనమంతా గాలిస్తున్నారు. ఆలా వెతుకుతుండగా వారిని కబంధుడనే రాక్షసుడు పట్టి తినబోయాడు. అతన్ని వధించగా అతను ఒక దివ్య పురుషుడిగా అవతరించి వారికి రుష్యముఖ పర్వతమున ఉన్న సుగ్రీవుడనే వానర రాజుని కలవమని అదృశ్యమయ్యాడు

The post రామాయణం అరణ్యకాండ సమాప్తం first appeared on Telugu Audibles📖.

View Details

రావణుడు సీతను అపహరించి లంకకు చేర్చాడు. రాముడు మారీచుడు అరిచిన తీరు చూసి ఎదో కీడు గ్రహించి వెనుదిరిగి ఆశ్రమానికి వస్తుండగా లక్ష్మణుడు ఎదురొచ్చాడు. ఇద్దరూ కంగారుగా ఆశ్రమానికి వెళ్లేసరికి సీత కనపడలేదు. అడవంతా గాలిస్తుండగా జటాయువు గాయాలతో కొనఊపిరితో కనిసిపించాడు.

The post రామాయణం అరణ్యకాండ – 6 first appeared on Telugu Audibles📖.

View Details

మాయలేడిని చూసిన సీత ముచ్చటపడి దానిని పెంచుకుంటా అని రాముడిని కోరగా, రాముడు మాయలేడి వెంటపడ్డాడు.

The post రామాయణం అరణ్యకాండ – 5 first appeared on Telugu Audibles📖.

View Details

ఖరదూషణుల వధ సంగతి రావణుడికి తెలిసింది. రామలక్ష్మణ ప్రతాపం గురించి, సీత అందచందాల సంగతి తెలుసుకుని సీతను ఎత్తుకురావడానికి మారీచుడి దగ్గరకు వెళతాడు. మాయలేడి రూపంలో మారీచుడు పంచవటిలో తిరగసాగాడు.

The post రామాయణం అరణ్యకాండ – 4 first appeared on Telugu Audibles📖.

View Details

సీత రామ లక్ష్మణులు పంచవటిలో జీవనం సాగిస్తూ ఉండగా సూర్పనఖ అనే రాక్షసి రామ లక్ష్మణులను చూసి మోహించింది. దాని ముక్కు చెవులు కోసి పంపేశారు. దానితో మొదలయిన ఆ రాక్షస వధతో, ఖరదూషణల వంటి పెద్ద పెద్ద రాక్షసులు రాముని చేతిలో హతులయ్యారు

The post రామాయణం అరణ్యకాండ – 3 first appeared on Telugu Audibles📖.

View Details

సీత రామ లక్ష్మణులు, వారితో వచ్చే మునులు ఎన్నో అడవులను దాటి మునుల ఆశ్రమ సమూహములకు చేరారు. ఒక్కొక్క ఆశ్రమంలో ఆతిధ్యం స్వీకరిస్తూ వారు పది సంవత్సరములు గడిపారు. ఆ తర్వాత సుతీక్ష మహాముని వద్ద చేరి, అక్కడినించి అగస్త్య మహాముని వద్దకి వెళ్లారు. అగస్త్యులు వారిని పంచవటి ప్రాంతంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకోమని సూచించగా సీతా రామ లక్ష్మణులు పంచవటి వెళ్లి ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు… “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం” అన్న మాట ఎందుకు …

రామాయణం అరణ్యకాండ – 2 Read More »

The post రామాయణం అరణ్యకాండ – 2 first appeared on Telugu Audibles📖.

View Details

సీతారామ లక్ష్మణులు దండకారణ్యం ప్రవేశించారు. వివిధ క్రూర రాక్షషులను వధించి శరభంగ మహాముని వద్దకు వెళ్లారు. అయితే అక్కడ చాల మంది మునీశ్వరులు రాముడి వద్దకు వచ్చి రాముడిని రాక్షషులనించి రక్షణ కోరారు. రాముడు ప్రతిజ్ఞ చేసి రాక్షశ వధ చేస్తానని వరం ఇచ్చెను.

The post రామాయణం అరణ్యకాండ – 1 first appeared on Telugu Audibles📖.

View Details

భరతుడు రాముడిని ఒప్పించేందుకు విశ్వ ప్రయత్నములు చేసాడు. మంత్రులు, వశిష్ఠ మహర్షి వంటి ప్రముఖుల సాయం తీసుకున్నాడు. రాముడు తండ్రి మాట జవదాటలేనని చెప్పేసరికి, భరతుడు రాముడి పాదుకలను సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యం చేసాడు. రామలక్ష్మణులు అత్రి మహాముని, అనసూయలను కలుసుకుని, దండకారణ్యం బయలుదేరెను

The post రామాయణం అయోధ్యకాండ సమాప్తం first appeared on Telugu Audibles📖.

View Details

భరతుడు రాముడి ఆశ్రమం చేరాడు. రాముడిని అయోధ్యకు వచ్చి రాజ్యమేలమన్నాడు. దానికి రాముడు భరతుడికి ఏమని చెప్పాడో, తిరిగి అయోధ్యకు వెళ్ళాడో లేదో ఈ భాగం లో వినొచ్చు.

The post రామాయణం అయోధ్యకాండ – 9 first appeared on Telugu Audibles📖.

View Details

రాముడు ఎటువెళ్ళాడు, ఎక్కడ బసచేస్తున్నాడు అని సుమంత్రుడిని అడిగి జాడ కనుక్కోసాగాడు. సేనను వెంటబెట్టుకుని వనము గాలిస్తున్నారు. ఈలోగా గుహుడు వారికి సహాయ పడ్డాడు…

The post రామాయణం అయోధ్యకాండ – 8 first appeared on Telugu Audibles📖.

View Details

భరతుడు ఇంటికి వచ్చి జరిగినదంతా తల్లి ద్వారా తెలుసుకుని శోకిస్తాడు. నాకు రాజ్యకాంక్ష లేదు, అది ధర్మం కాదు అని కైకేయిని దూషిస్తాడు. అన్నాను తిరిగి అయోధ్యకి తీసుకు రావడానికి అడవికి బయలుదేరుతాడు…

The post రామాయణం అయోధ్యకాండ – 7 first appeared on Telugu Audibles📖.

View Details

సీత, రామలక్ష్మణులు భరద్వాజ మహాముని ఆశ్రమం చేరారు. చిత్రకూట పర్వతంపై కుటీరం ఏర్పరచుకున్నారు. రాముడు మీద బెంగతో దశరథుడి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించసాగింది. చిన్ననాడు తాను చంపిన మునికుమారుని కథ చెప్పి ఆ శాపం గుర్తుకు తెచ్చుకుని కన్నుమూశాడు. భరతుడు అయోధ్యకు వచ్చాడు. కైకేయి భరతుడికి ఏమని చెప్పిందో వినండి..

The post రామాయణం అయోధ్యకాండ – 6 first appeared on Telugu Audibles📖.

View Details

సుమంత్రుడు రథంపై సీత రామ లక్ష్మణులను వెంటబెట్టుకుని దక్షిణ దిశగా బయలుదేరగా నగర వాసీయులు ఆత్రంగా రాముడిని చూడటానికి వెంటబడ్డారు. అంతఃపురంలో దశరధుని రోదనతో మార్మోగిపోయింది.. గుహుడు కలిసాక వారు భరద్వాజ మహాముని ఆశ్రమానికి వెళ్లారు. ఈ భాగం మీ ముందుకు…

The post రామాయణం అయోధ్యకాండ – 5 first appeared on Telugu Audibles📖.

View Details

రాముడు వనవాసానికి సిద్ధం కావడం, అయోధ్య నగర వాసులకు వివిధ దానాలు ఇవ్వడంతో అయోధ్య అంతా శోకమయమైంది. ఆ విషాద ఘట్టములతో ఈ కథ

The post రామాయణం అయోధ్యకాండ – 4 first appeared on Telugu Audibles📖.

View Details

రాముడు తిరిగి దశరధుని వద్దకు రావడం, కైకేయి వనవాసం గురించి చెప్పడం, రాముడు వనవాసానికి సిద్ధం కావడం, అయోధ్య మొత్తం చీకటిమయం కావడం వంటి విషాద సంగతులతో ఈ కథ

The post రామాయణం అయోధ్యకాండ – 3 first appeared on Telugu Audibles📖.

View Details

ఆ గూని మందర కైకేయిని ఎలా పెడదారి పట్టించింది! రాముడు 14 ఏళ్ళు వనవాసమా, భరతుడి పట్టాభిషేకమా? ఇది విని దశరథుడు తట్టుకోగలిగాడా? ఈ భాగంలో ఆ సన్నివేశములన్నీ కళ్ళకి కట్టేలా చెప్తాము.

The post రామాయణం అయోధ్యకాండ – 2 first appeared on Telugu Audibles📖.

View Details

దశరధుడు రాముడికి పట్టాభిషేకం చేసేందుకు సకల సన్నాహాలు చేయనారంభించాడు. అయోధ్య మొత్తం పండగ వాతావరణం నెలకొంది. ఆ సన్నివేశాలన్నిటినీ ఈ భాగంలో వినొచ్చు…

The post రామాయణం అయోధ్యకాండ – 1 first appeared on Telugu Audibles📖.

View Details

మేనక విశ్వామిత్రుడికి ఎలా తారస పడింది? భగ్నమయిన విశ్వామిత్రుడి తపస్సు చివరికి ఫలించిందా?  సీత స్వయంవరం విశేషాలు, రాముడు శివధనస్సును భంగం చెయ్యడం, పరశురాముడు రాముడిని విష్ణు ధనుస్సు విరవమని సవాలు చేసిన సన్నివేశం ఈ భాగంలో వినొచ్చు…

The post రామాయణం బాలకాండ ముగింపు first appeared on Telugu Audibles📖.

View Details

క్షత్రియుడయిన విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షి ఎలా అయ్యాడు? త్రిశంకుస్వర్గం అంటే ఏమిటి? అది ఎలా వచ్చింది? విశ్వామిత్రుడికి వసిష్ఠుడికి మధ్య వైరం తగ్గిందా? ఈ కథ వింటే తప్పక సమాధానం దొరుకుతుంది…

The post రామాయణం బాలకాండ – 5 first appeared on Telugu Audibles📖.

View Details

తాటకను సంహరించాక రామ లక్ష్మణులు, విశ్వామిత్రులు మిధులనగరమునకు పయనిస్తారు. మధ్యలో ఎందరో మహానుభావులను కలుస్తారు. ఈ కథలో విశ్వామిత్రుడు అతని వంశీకుల చరిత్ర క్లుప్తంగా ఉంటుంది..

The post రామాయణం బాలకాండ – 4 first appeared on Telugu Audibles📖.

View Details

విశ్వామిత్రుడి యాగం సఫలం కావడం, రాముడు తాటాకిని సంహరించడం, మరెన్నో సూక్ష్మ వివరములతో ఈ భాగం…

The post రామాయణం బాలకాండ – 3 first appeared on Telugu Audibles📖.

View Details

ఋష్యశృంగుడు దశరథుడి వద్ద అతిధిగా ఉంటున్నాడు. అశ్వమేధయాగం కోసం పెద్ద ఎత్తున ప్రయోగాలు మొదలుపెట్టారు..

The post రామాయణం బాలకాండ – 2 first appeared on Telugu Audibles📖.

View Details

నారద మహాముని వాల్మీకి ఆశ్రమం వచ్చి సకల సద్గుణ సంపన్నుడు, మహా పరాక్రముడు అయిన పురుషుడు ఈ యుగంలో ఉన్నాడా అని అడిగినప్పుడు, వాల్మీకి మహాముని రాముడి గురించి సవిస్తరంగా ఇలా చెప్పసాగాడు… Source – Chandamama magazine

The post రామాయణం బాలకాండ – 1 first appeared on Telugu Audibles📖.