రేడియో తరంగాలో చక్రవర్తి నలమోతు గారి కార్యక్రమం – “స్వేచ్చ వాదం” లో, మార్చి 22 వ తారీఖున ప్రజలు తుపాకుల యజమానులవ్వడంలో గల లాభాలను భేరీజు వేశారు. అందుకు ఏవేవో గణాంకాలు నెమరవేశారు. వెరసి – అమెరికా దేశం లోని ఎంతో పలుకుబడి ఉన్న gun lobby ప్రచారం చేసే వితండవాదాలే చక్రవర్తి గారు కూడా సెలవిచ్చారు. వింటుంటే “నిజమేకదా” అనిపించేంత వాక్చాతుర్యం అది. కాని అందులో చాల లొసుగులు ఉన్నాయి. చక్రవర్తి వాదనలో నిర్లక్ష్యం చేసిన, కప్పి పుచ్చిన నిజాలు చాల ఉన్నాయి. ఆ నాణేనికి రెండవ వైపు చూపిద్దామని నాఈ వాదనను ఇవాల్టి (మార్చ్ 23 , 2012 ) MMGL లో ప్రసారం చేశాను. మీరు వినక పోతే తప్పక వినండి.