శబ్ద తరంగాలు – ఈమాట: Recent Episodes

None

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries

View Details

మన దేశవాళీ వంగ, కర్ణాటక, పంజాబీ సంగీతాలే కాదు, రజని మధ్య ప్రాచ్య సంగీతం ఆధారంగా ఎన్నో పాటలు వ్రాసి స్వరపరిచారు. మధ్య ప్రాచ్య సంగీతం ఆయన స్వభావానికి మరింత దగ్గరైన సంగీతం అనుకుంటాను. ఆయన ఒక సంగీతస్వరం వింటే దానిలో ప్రయోగాలు చెయ్యకుండా వుండేవారు కారు.

View Details

ఈ సంచికలో కొన్ని జానపద పాటలు విందాం. ఇవి నిజంగా జానపదుల పాటలా లేక ఆధునిక రచనలా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ జానపద వాఙ్మయం మనకు జాతీయవాదం బలంగా వున్న రోజుల్లో సినిమాల్లోను, గ్రామఫోను రికార్డులపైన, ముఖ్యంగా రేడియోలోను చాలా ప్రముఖంగా వినబడేది.

View Details

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మంగళకైశికి రాగంపై చేసిన ప్రసంగం; లలిత సంగీతం అంటే ఏమిటి? నలుగురు ప్రముఖుల - రజని, మంగళంపల్లి, ఈమని, ఎమ్. ఎన్. శ్రీరాం - అభిప్రాయాలు, ఆలిండియా రేడియో ప్రసారం; మరికొన్ని లలితగీతాలు, ఈ ప్రత్యేక సంచికలో మీకోసం.

View Details

వేడుకొంటిని వేలసారులు విసిగించితి మాధవాఆడుకొమ్మని ఒక్కసారికి అనకపోతిని కేశవా కావుకావని కేకలేసితి కరుణలేదని కూకలేసితిబ్రోవుబ్రోవని బేరమాడితి కడుపు నిండిన గొంతుతో

View Details

ఈ పదిహేనేళ్లలో సేకరించిన సమాచారం/పాటల-లో ‘చల్ మోహనరంగా’ అన్న నిడివైన పాట ఒకటి ముఖ్యమైనది. ఈ సంచికలో కేవలం ఆ పాట ఆధారంగా తయారయిన ఒక లఘు చిత్రం గురించిన వివరాలు చూద్దాం. దీన్ని వాలి సుబ్బారావు, పుష్పవల్లి పైన చిత్రీకరించారు.

View Details

శ్రీశ్రీ రాతలతో పరిచయం వున్నవారికి ‘హరీన్‌ చటో, గిరాం మూర్తి ఇటీవల మా ఇన్స్పిరేషన్’ అన్న శ్రీశ్రీ మాట తెలుసు. శ్రీశ్రీ సప్తతి ఉత్సవాలు కాకినాడలో జరిపినప్పుడు హరీన్ చటోని ఆహ్వానించారు. ఈ సప్తతి సభకి ఆయనే అధ్యక్షుడు. మంచి నటుడు, గాయకుడు, హార్మోనియం బాగా వాయించేవాడు.

View Details

సి. కృష్ణవేణి, ఎన్. టి. రామారావు తాము సొంతంగా తీసిన సినిమాలలో ఎమ్. ఎస్. రామారావుకి పాడే అవకాశం ఇచ్చారు. ఏదయినా ఘంటసాల గాయకునిగా బలపడిన తరవాత ఎమ్. ఎస్. రామారావుకి అవకాశాలు తగ్గిపోయాయి అన్నది వాస్తవం.

View Details

ఓలేటి వెంకటేశ్వర్లు పాడిన ‘కడచేనటే సఖియా’ చాలా మందికి తెలిసి ఉండవచ్చు. ఓలేటి పేరు వినగానే వెంటనే స్ఫురించే పాట. 12-13 సంవత్సరాల క్రితం ఈ పాటని ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం సమర్పించిన ఒక టి.వి. కార్యక్రమంలో మల్లాది బ్రదర్స్‌లో ఒకరైన రవికుమార్ పాడి బోలెడు ఆసక్తిని రేకెత్తించి కొత్త తరానికి కూడా పరిచయం చేసిన పాట.

View Details

విలక్షణమైన రచనాపటిమ, ప్రత్యేకమైన శైలి-శిల్పాలతో కలాన్ని మంత్రదండంగా మార్చిన కథా రచయిత చంద్ర కన్నెగంటి. ఆయన వ్రాసిన కథల్లోంచి పన్నెండు ఆణిముత్యాలు, శ్రీనివాస్ బందా స్వరంలో వినండి.

View Details

ఎవరి గ్రంథం వారే అచ్చువేయించుకోవలసి రావడం కవులకు ఎంత దౌర్భాగ్యమో వివరిస్తూన్న శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి అనుభవాలూ-జ్ఞాపకాలూనూ పుస్తకం రెండవభాగం నుంచి 35వ ప్రకరణం, పఠనరూపంలో.

View Details

ఈ సంచికలో వినిపిస్తున్న పదహారు పాటలలో, ఒక్క రెండిటిని మినహాయిస్తే, అన్నీ ప్రైవేటు పాటలుగా రికార్డులపైన వచ్చినవి. వైజయంతిమాల సొంతంగా తెలుగులో ఇచ్చిన నాలుగు పాటల రికార్డులు, గాయని ఎమ్. కృష్ణకుమారి, గాయని బి. ఎన్. పద్మావతి పాడిన పాటలు. వీరి వివరాలు తెలిపితే సంతోషం.

View Details

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు గిడుగు రామ్మూర్తి పంతులుగారిని కలుసుకున్న సందర్భాన్ని వ్యాసరూపంలో, వారి ప్రబుద్ధాంధ్ర పత్రికలో (డిసెంబరు10, 1935) ప్రకటించారు. ఆ వ్యాసపు పఠనరూపం ఇది.

View Details

ప్రస్తుతం నా ఆడియో టేపులు, డిస్కులు నాకు అందుబాటులో లేవు. అందువల్ల ఈ నెలలో కూడా మరికొన్ని లలిత గీతాలే అందిస్తున్నాను. ఇవన్నీ విజయవాడ రేడియో కేంద్రం నుండి ప్రసారమవుతున్నప్పుడు వేర్వేరు సమయాల్లో రికార్డు చేసుకున్నవి.

View Details

ఈ సంచికలో దాశరథి, భుజంగరాయశర్మ, విశ్వేశ్వరరావు, అడవి బాపిరాజు వంటి ప్రముఖులు రచించిన కొన్ని లలితగీతాలు వినిపిస్తున్నాను. ఓలేటి వెంకటేశ్వర్లు, వేదవతి, ఛాయాదేవి తదితరులు పాడిన ఈ గీతాలు మొదటగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యాయి.

View Details

సుగ్రీవ విజయము అనే పేరుగొన్న ఈ యక్షగానం బాలాంత్రపు రజనీకాంతరావుగారి (రజని) శతజయంతి సందర్భంగా ఆయనతో నాకున్న మంచి పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ వినిపిస్తున్నాను. రుద్రకవి చరిత్ర, సాహిత్యంపై జరిగిన, జరుగుతున్న చర్చలపై మీకు ఆసక్తి ఉన్నా, లేకపోయినా ఈ సంగీత కార్యక్రమం మాత్రం మీకందరికీ నచ్చుతుందనే ఆశిస్తాను.

View Details

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు ద్విజావంతి రాగంపై చేసిన ప్రసంగం విందాం. హిందుస్తానీ పద్ధతిలో ఈ రాగాన్ని జయజయావంతి అని పిలుస్తారని అనంతకృష్ణశర్మగారు చెప్తారు. శాస్త్రీయ సంగీతం తెలియని వాళ్లకి సినిమా పాటల భాషలో చెప్పాలంటే ఈ రాగం ఆధారంగా తెలుగు సినిమాల్లో కొన్ని పాటలు వచ్చాయి.

View Details

[ఈ సంచికలో శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ రచించిన మాట మౌనం (1988) అన్న సంగీత రూపకం సమర్పిస్తున్నాను. దీనికి సంగీతం కూర్చినది శ్రీ కలగా కృష్ణమోహన్. ఈ రూపకంలో రజనీకాంతరావు, మల్లాది సూరిబాబు, బాలకృష్ణప్రసాద్, చదలవాడ కుసుమకుమారి, విద్యుల్లత గార్లు పాడిన పాటలు వినవచ్చు. - పరుచూరి శ్రీనివాస్.]

View Details

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ సాహిత్యం అందించిన ఈ రూపకం మొదట ఆగస్ట్ 25, 1986న ప్రసారం అయి, అదే ఏడు సంగీత విభాగంలో జాతీయస్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఈమాటకు ఈ రూపకం అందించినవారు: పరుచూరి శ్రీనివాస్.

View Details

శ్రీకాంతశర్మగారు రచనలతో రూపొందించబడిన చాలా కార్యక్రమాలు ఆకాశవాణి జాతీయస్థాయి పోటీలలో అగ్రస్థానాలు అందుకున్నాయి. వాటిలో ఒక రూపకం ఇది. ఈ రూపకం అందించినవారు: పరుచూరి శ్రీనివాస్.

View Details

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కలం నుంచి జాలువారిన మరొక అద్భుత రూపకం ఈ గంగావతరణం. కలగా కృష్ణమోహన్ సంగీతంలో వెలువడిన ఈ రూపకం అప్పుడూ ఇప్పుడూ కూడా శ్రోతలను అలరిస్తూనే వుంది. ఈ రూపకం అందించినవారు: పరుచూరి శ్రీనివాస్.

View Details

నవంబర్ 2015 సంచికలో బాలానంద బృందం 78rpm రికార్డులపైన, రేడియోలోను పాడిన కొన్ని పాటలు, రేడియోలో సమర్పించిన కొన్ని కార్యక్రమాలు విన్నాం. ఈ సంచికలో మరికొన్ని పాటలు, కథలు విందాం.

View Details

ప్రముఖ సినీనటుడు కొంగర జగ్గయ్యతో 1995లో 'వ్యాపకాలు జ్ఞాపకాలు' అన్న శీర్షిక తో విజయవాడ రేడియో కేంద్రం 1995లో దంటు పద్మావతిగారు నిర్వహించిన సంభాషణ వినండి.

View Details

కానీ ఈ పాటైనా, తక్కిన కృష్ణమ్మా గోపాలబాలా కృష్ణమ్మా హరి హరి గోవింద బాలా కృష్ణమ్మా, ఓ యశోద ఏమి చేయుదమే, నందగిరి బంగారుమామ చంద్రగిరి చీరలంపేవా, పాటల కైనా సాహిత్యాన్ని ఇవ్వటం కష్టమైన పని. సాధ్యంకాని పని అని చెప్పాలేమో! ఈ ఆడియోలో పాడిన పాఠం మీకు పుస్తకాలలో కనపడే పాఠాలకి భిన్నంగా ఉంటే ఆశ్చర్యం లేదు.

View Details

ఈ సంచికలో సి.ఎస్.ఆర్ పాడిన కొన్ని పాటలు, పద్యాలు విందాం. సి. ఎస్. ఆర్ పూర్తి పేరు చిలక(ల)పూడి సీతారామాంజనేయులు. ఆయన మొదట నాటకాల్లోను తరువాత సినిమాల్లోను వేసిన పాత్రల గురించి సమాచారం ఇప్పుడు ఇంటర్నెట్లో తేలికగానే అందుబాటులో వుంది.

View Details

అనంతకృష్ణశర్మగారు సాహిత్య రంగంలోనే కాదు సంగీత రంగంలో కూడా గొప్ప పండితులన్న విషయం అందరికీ తెలిసినదే. ఈ సంచికలో వినిపిస్తున్న ప్రసంగం మార్చ్, 1960లో అపూర్వ రాగములు అన్న శీర్షిక క్రింద సైంధవి రాగంపై ఆకాశవాణిలో చేసినది.

View Details

తొలి అయిదు దశాబ్దాలలో, అంటే 1981-82 వరకు, వచ్చిన హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ, బెంగాలీ సినిమాలతో పోలిస్తే తెలుగు సినిమారంగానికి రెండు ప్రత్యేకతలున్నాయి. చాలా మంది పాటల రచయితలు ప్రథమంగా పేరొందిన కవులు కావడం, అలాగే సంగీత దర్శకులు మంచి గాయకులు కూడా కావడం.

View Details

గాయకుడిగా ఆయన ప్రతిభకు స్పష్టంగా అద్దం పట్టే పాటలివి. మొదటి రెండు 1948లో మహాత్మా గాంధి మరణానంతరం రాసి, హెచ్.ఎం.వి. వారికి రికార్డుగా ఇచ్చినవి. అదే సమయంలో గాంధీకి నివాళులర్పిస్తూ చాలా భారతీయ భాషలలో బాగా పేరు పొందిన గాయనీగాయకులు రికార్డులిచ్చారు.

View Details

2003లో హైదరాబాదులో కె.వి.రావుగారు, మరికొందరు సంగీతాభిమానులు కె.రాణి, ఎ.పి.కోమల, సి. కృష్ణవేణిగార్లను ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమం జరిపారు. వ్యక్తిగతంగా ఆ రోజుల్లో నేను, మిత్రులు మధుసూదనశర్మగారితో కె. రాణిగారిని రెండుసార్లు హైదరాబాదులో కలిశాను. చాలా బాగా మాట్లాడేవారు.

View Details

రజని 1988లో ఆకాశవాణి వారికిచ్చిన ఈ ఇంటర్‌వ్యూ నా దృష్టిలో చాలా అపురూపమైనది. రజని సంగీత, సాహిత్య, వ్యక్తిగత వికాసాల గురించిన ఎన్నో వివరాలు వినవచ్చు. అంతకంటే, 1920-30ల నాటి తెలుగు సాహిత్య, సంగీత చరిత్రల గురించిన ఎంతో ఆసక్తికరమైన సమాచారం ఈ ఇంటర్‌వ్యూలో ఉంది.

View Details

ఇలాంటి ప్రయోగం ఇంతకూ ముందు, తరువాత కూడా ఎవరూ చేయలేదు. రామాయణ అవతరణ కథను వాద్యగోష్ఠిలో వివిధ రాగాలలో క్రౌంచ మిథునంతో మొదలు పెట్టి కొన్ని ఘట్టాలుగా విభజించి కల్పన చేశారు. దీని సృజన లేక సృష్టి వెనుకనున్న కొన్ని వివరాలను రజనీకాంతరావుగారే (ఇంగ్లీషులో) వివరిస్తారు.

View Details

అన్నమయ్య సంకీర్తనలలోని రాగాల విశిష్టత పైన రజనీకాంతరావుగారు చేసిన ఈ ప్రసంగం 2000 సంవత్సరం ఆగస్టు నెల చివరిలో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైంది.

View Details

మొదటి అయిదు పాటలు ఎన్. సి. వి. జగన్నాథాచార్యులుగారు పాడినవి. 'స్వరముల తూగే ఘనరాగమయివో' అన్న గోదావరి నదిపైన పాట (రచన: ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, సంగీతం: మల్లిక్) కేవలం జగన్నాథాచార్యులుగారి పాటలతో ఒక సంకలనం చేయాలనే కోరిక చాలా సంవత్సరాలుగా ఉంది కాని, వారి వారసులు అదే ఆలోచనలలో ఉన్నారని వింటున్నాను.

View Details

ఈ మధ్య మరీ 'తాతల కాలంనాటి పాతపాటలు' వినిపిస్తున్నానని కొంతమంది వ్యక్తిగతంగా ఫిర్యాదు చేశారని, రేడియో ప్రసంగాలు ఏమయినా ఉన్నాయా అని నా టేపుల్లో వెతుకుతుంటే మో (వేగుంట మోహనప్రసాద్), సంజీవదేవ్‌, విజయవాడ రేడియో కేంద్రంలో మాట్లాడినవి దొరికాయి.

View Details

కళావర్ రింగ్ (1908-1964) అన్న పేరు నేను మొదటిసారి విన్నది 1981-82 ప్రాంతాల్లో. ఆవిడ అసలు పేరు సరిదె లక్ష్మీ నరసమ్మ. కళావర్ రింగ్ అన్న పేరు రావటానికి ఒక శృంగార పురుషుని చేతికున్న కళావర్ మార్కు ఉంగరం కావాలి అని మారాం చేస్తే అతడు ఆవిడను చేరదీసినట్లు, అప్పటి నుండి ఆ పేరు స్థిరపడిపోయినట్లు చెప్తారు.