The Anil Atluri Show: Recent Episodes

Anil Atluri

View Details

Tanikella Bharani నాటకోత్సవాల సందర్భంలో..దర్శకుడు తల్లవఝల సుందరానికి ప్రశంసా పత్రాన్ని వ్రాసిన చలన చిత్ర నటుడు ఉత్తేజ్‌ లో ఒక రచయిత ఉన్నాడని భరణి చెప్పె దాకా తెలియలేదు.

ఆ ప్రశంసాపత్ర ఝరిలో అందరు తడిసి ముద్దై పోతుంటే..బ్రహ్మానందం..లేచి వచ్చి పోడియం వద్దనున్న ఉత్తేజ్‌ని పుష్పమాలాంకృతుడ్ని చెయ్యడం ఒక గొప్ప అనుభవం! ఎంత చక్కగా చెప్పాడో ఉత్తేజు. వినండి!

View Details

మొన్న అంటే, ౨౩ మే, రవింద్ర భారతి లో "కిన్నెర" వారి "తెలుగు కవిత మహోత్సవాలు" లో భాగంగా రాళ్ళబండి కవితా ప్రసాద్ రూపొందించిన "తెలుగు వెన్నెల"లో 'అనువాద కవిత్వం – దశ – దిశ' అనే అంశంపై వాడ్రేవు చిన వీరభద్రుడు చేసిన కీలకోపన్యాసం సభికులను విశేషంగా ఆకర్షించింది.

ఆ ప్రసంగం ఇక్కడ వినగలరు.