నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రంరంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయంభారత దేశం మన జన్మ ప్రదేశంభారత ఖండం ఒక అమృత భాండం || భారత దేశం || ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరందక్షిణాన నెలకొన్నది హిందు సముద్రంతూరుపు దిశ పొంగిపొరలె గంగా సంద్రంపశ్చిమాన అనంతమై సింధు సముద్రం || భారత దేశం ||ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశంరత్న గర్భ పేరుగన్న భారత దేశంధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరంసత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం || భారత దేశం ||కోకిలమ్మ పాడగలదు జాతీయగీతంకొండ కోన వాగు పాడు సంస్కృతి గీతంగుండె గుండె కలుసుకొనుటె సమరస భావంచేయి చేయి కలిపితేనె ప్రగతుల తీరం || భారత దేశం ||